చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషాదం మరువక ముందే, అదే మార్గంలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కరణ్‌కోట మండల సమీపంలో కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన డ్రైవర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం రోడ్డును క్లియర్ చేసేందుకు బస్సు, లారీని క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.
ప్రమాదానికి అధిక వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బస్సు, లారీ రెండూ కర్ణాటక రాష్ట్రానికి చెందినవని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ప్రమాద దృశ్యాలను స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో వీడియో వైరల్‌గా మారింది.
