టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సెలబ్రిటీలూ శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన బన్నీకి సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టింగ్ స్థాయిలో విషెస్ అందుతున్నాయి.
ఇందులో భాగంగా యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా స్పెషల్ మెసేజ్‌లు షేర్ చేశారు. బన్నీని తమకు ఎంతో ఇష్టమైన వ్యక్తిగా పేర్కొంటూ ప్రత్యేకంగా హృదయానికి హత్తుకునే శుభాకాంక్షలు చెప్పారు.
రష్మిక ఇన్‌స్టాగ్రామ్ లో స్పందిస్తూ – “అల్లు అర్జున్ సర్, మీ బర్త్‌డే ఆనందంగా జరుపుకోండి. మీరు ఈ రోజు ప్రతి క్షణాన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారని నాకు తెలుసు. ఇది మీ హ్యాపియెస్ట్ బర్త్‌డే కావాలని కోరుకుంటున్నాను” అంటూ ప్రేమాభిమానాలతో ఓ మెసేజ్ పెట్టారు.
విజయ్ దేవరకొండ బన్నీకి హ్యాపీ బర్త్‌డే చెబుతూ – “బన్నీ అన్నా, నీకు ఎంతో గొప్ప విజయాలు రాలాలని కోరుకుంటున్నా. నా నుంచి నీకు ఆలింగనాలు, ప్రేమ” అంటూ తన అభిమానాన్ని మరోసారి చాటాడు. ఈ విషెస్ ఇప్పుడు అభిమానుల మన్ననలు అందుకుంటున్నాయి.