ఉప్పల్ నియోజకవర్గం నాచారం లో వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని సూపర్ మార్కెట్‌ను ప్రారంభించారు.
బాలకృష్ణను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, వాల్యూ జోన్‌ను ప్రారంభించడం తనకు సంతోషకరంగా ఉందని అన్నారు. సాంకేతికంగా విడిపోయిన తెలుగువాళ్లు అంత ఒకటే అనడంతో పాటు, అన్ని దేశాలలో తెలుగువారు తమ ప్రతిభను చాటుకుంటున్నారని చెప్పారు. వాల్యూ జోన్‌లో ప్రతి ఒక్కరికీ అవసరమైన వస్తువులు అందుబాటులో ఉన్నాయని బాలకృష్ణ పేర్కొన్నారు.
బాలకృష్ణ తనదైన శైలిలో మాట్లాడుతూ, నాచారం తనకు ఇంటిగా భావిస్తానని, తమ స్టూడియోకు బైక్ పై వచ్చేవాడినని జోరుగా చెప్పారు. ఆయన మాటలతో ఆ సందర్భం మరింత ఉత్సాహంగా మారింది.
ఈ సందర్భంగా, పేద ఎంబిబిఎస్ విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని బాలకృష్ణ అభినందించారు. ఇదే సమయంలో, నాచారం ప్రజలకు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అందించడానికి తన ప్రతిష్టను కొనసాగిస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.
