నాతవరం మండలం చిన గొలుగొండపేటలో గ్రామ నాయకులు బాలరాజు ఆధ్వర్యంలో ఆదివారం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ముఖ్య అతిధిగా హాజరై జెండా ఆవిష్కరించి మాట్లాడారు.
గడిచిన ఎన్నికల్లో జనసేన ప్రభంజనం చూశారని చెప్పారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గ్రామ గ్రామాన జనసేన పార్టీ బలోపేతం అయిందన్నారు.
రానున్న రోజుల్లో గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత ముందుకు తీసుకు వెళతామన్నారు. జనసేన పార్టీ నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా గ్రామీభివృద్ది జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నర్సీపట్నం మున్సిపాలిటీ అద్యక్షులు అద్దేపల్లి గణేష్, నాతవరం మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

 
				
			 
				
			 
				
			 
				
			