దుబాయిలో ఇద్ద‌రు తెలంగాణ వాసుల హ‌త్య ఉదంతం

Two Telugu men from Nirmal and Nizamabad were brutally killed by a Pakistani co-worker in Dubai. The incident came to light belatedly. Two Telugu men from Nirmal and Nizamabad were brutally killed by a Pakistani co-worker in Dubai. The incident came to light belatedly.

దుబాయిలో ఇద్దరు తెలుగువారిని ఓ పాకిస్థానీ కిరాతకంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన అష్టపు ప్రేమ్సాగర్ (40), నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ ఇద్దరూ దుబాయిలోని ఓ ప్రముఖ బేకరీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

అదే బేకరీలో పని చేసే ఓ పాకిస్థానీ వ్యక్తి మత విద్వేషంతో పాటు పని ఒత్తిడిని కారణంగా చూపుతూ, వీరిద్దరిపై అతి దారుణంగా కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో మృతులు అతి భయంకరంగా నరికి చంపబడినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో అక్కడ ఉన్న మరో ఇద్దరు తెలుగు వ్యక్తులు కూడా గాయపడ్డారని సమాచారం.

దాడి అనంతరం హంతకుడు మతపరమైన నినాదాలు చేసినట్టు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే బేకరీ యాజమాన్యం ఈ విషయాన్ని బయటకు వెళ్లకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అందుతోంది.

ప్రస్తుతం అక్కడి పోలీసు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఈ విషయం ఆలస్యంగా తెలిసి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అధికారికంగా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *