ఈరోజు (సోమవారం) భూమికి సమీపం నుండి రెండు భారీ గ్రహశకలాలు ప్రయాణించనున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపిన ప్రకారం, వాటి పేర్లు ‘2024 ఎక్స్‌వై5’ మరియు ‘2024 ఎక్స్‌బీ6’. ఈ రెండు గ్రహశకలాలు డిసెంబర్ 16న భూమి వైపు ప్రయాణిస్తాయని నాసా ప్రకటించింది. అయితే, భూమికి ఎలాంటి ముప్పు ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
‘2024 ఎక్స్‌వై5’ గ్రహశకలం 71 అడుగుల వెడల్పుతో ఉంది. ఇది గంటకు 10,805 మైళ్ల వేగంతో ప్రయాణించనుంది. ఈ గ్రహశకలం భూమికి దాదాపు 2,180,000 మైళ్ల దూరం నుంచి బయలుదేరుతుంది. చంద్రుని దూరం కంటే 16 రెట్లు ఎక్కువ దూరం నుంచి ఈ గ్రహశకలం భూమి సమీపం చేరుకుంటుంది.
ఇక, ‘2024 ఎక్స్‌బీ6’ గ్రహశకలం కొంచెం చిన్నది. దీని వ్యాసం 56 అడుగులుంటుంది. గంటకు 14,780 మైళ్ల వేగంతో ఈ గ్రహశకలం భూమికి దాదాపు 4,150,000 మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుంది. ఈ రెండు గ్రహశకలాలు సౌర వ్యవస్థ ఆరంభానికి సంబంధించినవి, ఇవి సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ రకమైన గ్రహశకలాలను అధ్యయనం చేస్తే భూమి మూలాలు మరియు విశ్వం చరిత్ర గురించి విలువైన సమాచారం పొందవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. భూమికి సమీపంలో ఉన్న వస్తువులను పర్యవేక్షించేందుకు నాసా అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తున్నది.
