తిరుమలలో టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం అన్నమయ్య భవనంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షత వహించగా, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహా పలువురు బోర్డు సభ్యులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను బోర్డు ఆమోదించనుంది. గతేడాది రూ. 5,141.74 కోట్లు బడ్జెట్‌గా ప్రవేశపెట్టగా, ఈ ఏడాది దాదాపు రూ.5,400 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.
సభలో 30కి పైగా అజెండా అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా, గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు, కొత్త ప్రాజెక్టుల నిధుల కేటాయింపు, భక్తుల సౌకర్యాల మెరుగుదలపై కీలక తీర్మానాలు చేయనున్నారు.
టిటిడి నిర్వహిస్తున్న పలు ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు మరింత నిధులు కేటాయించే అంశంపై కూడా చర్చ జరుగనుంది. తిరుమల అభివృద్ధికి సంబంధించి భక్తుల నుంచి వచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం.

 
				 
				
			 
				
			 
				
			