అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. తాజా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ట్రంప్, దీపావళి సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో సందేశం పంచుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ పట్ల విమర్శలు కూడా గుప్పించారు. ఆమె, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, హిందువులను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రంప్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులను తన హయాంలో అంగీకరించబోమని స్పష్టంగా చెప్పారు. ఆ ప్రాంతాల్లో మైనారిటీలను వదలకుండా దోచుకుంటున్నారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పాలనలో ఇలాంటివి జరగకపోవడం పట్ల విశ్వాసం చూపిస్తూ, బైడెన్-హారిస్ పాలనను విమర్శించారు.
ట్రంప్ తన సందేశంలో, ప్రస్తుతం అమెరికా మరియు ఇతర ప్రాంతాలలో సరిహద్దుల్లో అస్థిరత కొనసాగుతోందని, కానీ తాను గెలిస్తే అమెరికాను మళ్లీ శాంతి మరియు బలం పుంజుకునేలా చేస్తానని పేర్కొన్నారు.