వికారాబాద్ జిల్లా పరిగి యందు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (TJMU ) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి వీరమరణం పొందిన ఆర్టీసీ కార్మికులకు ఘన నివాళులు అర్పించారు.
2019 అక్టోబర్ 5వ తేదీ నుంచి 55 రోజులు సమ్మె సమయంలో సుమారు 38 మంది ఆర్టీసీ కార్మికులు వీర మరణం చెందిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో పరిగి డిపో నాయకులు వెంకట్ రాములు, బోయిని కృష్ణ, శంషాద్దీన్, ప్రసాద్, సురేష్ ,బీవీ బాబు, వెంకటేశ్, జంగయ్య, సంజీవ్ కుమార్, యాదమ్మ,అరుణ, మైబమ్మ,GV లక్ష్మీ,ఐనాపూర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
