మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి, సాయి బాబాకు ఎమ్మెల్సీ డిమాండ్

BC Federation honors Jyotiba Phule's legacy, urges MLC seat for Sai Baba in Mantralayam, highlighting his service and dedication. BC Federation honors Jyotiba Phule's legacy, urges MLC seat for Sai Baba in Mantralayam, highlighting his service and dedication.

మంత్రాలయం నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకులు పి సాయి బాబ గారికి ఎమ్మెల్సీ సీటు కేటాయించాలి.బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు
ఈరోజు ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ ఆధ్వ ర్యంలో రాష్ట్ర ఉపా ధ్యక్షులు దస్తగిరి నాయు డు అధ్యక్షతన ప్రాంతీ యకార్యాల యంలో మహాత్మ జ్యోతిబాపూలే 134వ వర్ధంతి ఘనంగా జరుపు కోవడమైనది. ముందుగా బీసీ నాయకు లు మహాత్మ జ్యోతి బా పూలే చిత్ర పఠమునకు పూలమాలలు వేసి నివాళులర్పించడమైనది. బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు మాట్లాడుతూ
సమసమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడు మహాత్మా జోతిరావ్ పూలే:మహత్మా జ్యోతిరావు ఫూలే’ గురించితెలుసుకోవడమంటే ఆధునిక భారత దేశ సామాజిక వ్యవస్థను తెలుసుకోవడమే. భారతదేశంలో మొట్ట మొదటి నిజమైన ‘మహాత్మా’జ్యోతిరావు పూలే,
జ్యోతిబా ఫూలే చేసిన కృషిని, ప్రభావాన్ని చాటిచెప్పేందుకు 1888 మే 11న పూణేలో పెద్ద బహిరంగసభ జరిగింది. వేలాది మందిప్రజల సమక్షంలో జోతిరావు ఫూలే”మహాత్మ” అనే బిరుదుతో సత్కారం పొందాడు.
మహాత్మ జ్యోతిరావు 1827 ఏప్రిల్‌ 11న పూణేలో జన్మించాడు. తన భార్య సావిత్రి బాయితో కలిసి 1848లో తొమ్మిది మందితో దేశం లోనే తొలి బాలికల పాఠశాలనుప్రారంభించారు.పూలేదంపతులు అనేకసంస్కరణలు చేపట్టి సామాజిక విప్లవానికి బాటలు వేసారుస్వేచ్చ,సమానత్వం, ఐక్యమత్యం, మానవత్వంతో కూడినసమసమాజాన్ని కాంక్షించాడు పూలే. బాధలు,ఇతర. సమ సమాజ స్థాపన కోసం నిరంతరం తపిస్తూ అనారోగ్యంతో ఫూలే 1890 నవంబర్‌ 28న మరణించాడు. కుల వివక్షను ఎదిరించి బహుజనుల బతుకుల్లో వెలుగు రేఖలు ప్రసరింప జేసిన క్రాంతిజ్యోతి. వెట్టి బతుకుల్లో తొలిపొద్దు మహాత్మ “జ్యోతిరావు ఫూలే”కు జోహార్లు.
భారతదేశ సామాజిక విప్లవోద్యమంలో, సంఘసంస్కరణోద్యమంలోతనభర్తతోసమానంగా పోరాడిన సాహస వనిత “సావిత్రిబాయి”కిజోహార్లు.పూలే దంపతులకు ఘనంగా నివాళులు అర్పిద్దాం -వారి ఆశయాలుసాధించేందుకు కృషి చేద్ధాం…
ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ. నారా చంద్రబాబునాయుడు గారు ఆదోని డివిజన్ మంత్రాలయం నియోజ కవర్గం ఇంతవరకు ఏ పదవిని నోచుకోని సీనియర్ నాయకులు పి సాయి బాబా గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేయడమైనది.
ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పి సాయి బాబా, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ధనాపురం శేషన్న, పట్టణ అధ్యక్షులు ఆదోని పట్టణ అధ్యక్షులు డాక్టర్ వీరేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *