అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రాన్స్ జెండర్ గా చరిత్ర సృష్టించిన సారా మెక్ బ్రైడ్, డెలావేర్ నుంచి సెనెట్ కు పోటీ చేసి విజయాన్ని సాధించారు. ఈ ఘనత సాధించిన సారా మెక్ బ్రైడ్ తొలిసారి అధికారికంగా సెనేట్ లోకి అడుగుపెట్టనున్న ట్రాన్స్ జెండర్‌గా రికార్డులకెక్కారు. మంగళవారం పోలింగ్ ముగిశాక చేపట్టిన ఓట్ల లెక్కింపులో సారా ఆధిక్యం కనబరిచారు. మూడింట రెండొంతుల మంది ఓటర్లు ఆమెకు ఓటేశారు. రిపబ్లికన్ అభ్యర్థి జాన్ వాలెన్ ని 3 పాయింట్లతో ఓడించి, ఆమె ఈ ఘనత సాధించారు.
సెనేటర్ గా గెలిచిన తర్వాత సారా మెక్ బ్రైడ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “పునరుత్పత్తి విషయంలో స్వేచ్ఛను పరిరక్షించేందుకు అమెరికా కట్టుబడి ఉంటుందనే విషయాన్ని డెలావేర్ ఓటర్లు గట్టిగా చాటిచెప్పారు. ఈ ప్రజాస్వామ్యం మనందరికీ కావలసినది” అని ఆమె పోస్టు చేశారు. ప్రజల సంక్షేమం కోసం ఆమె భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యల గురించి కూడా వివరించారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా సారా మెక్ బ్రైడ్, “నేను గెలిస్తే, చైల్డ్ కేర్ ఖర్చులను అందరికీ అందుబాటులో ఉంచుతాను. ఉద్యోగస్తులకు పెయిడ్ ఫ్యామిలీ, మెడికల్ లీవ్ సౌకర్యం కల్పిస్తాను” అని హామీ ఇచ్చారు. అలాగే, హౌసింగ్, హెల్త్ కేర్ లో మెరుగైన వసతులు అందించేందుకు కృషి చేస్తానని, ట్రాన్స్ జెండర్ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడతానని, సభల్లో వారి తరఫున గళం వినిపిస్తానని ఆమె చెప్పారు.

 
				 
				
			 
				
			 
				
			