గత కొన్ని రోజుల నుంచి వాహనాల్లో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడే వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో 53 సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి నష్టం చేయడమే కాక, సైలెన్సర్ మార్ఫింగ్ చేస్తూ శబ్ద కాలుష్యాన్ని పెంచే వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ మాట్లాడుతూ, వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ఆర్టీవో నిబంధనల ప్రకారం సైలెన్సర్ ఉంటుంది. అయితే కొంతమంది వ్యక్తులు శబ్దం పెరిగే సైలెన్సర్లను మార్చి, శబ్ద కాలుష్యాన్ని పెంచుతారు. ఈ కారణంగా వీరిపై ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు.
సంబంధిత వాహన యజమానులకు సరైన సైలెన్సర్లను కొనుగోలు చేయించి, వాహనాలకు వాటిని ఫిట్ చేయించారు. ఈ రోజున, 53 సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రోడ్డు రోలర్‌తో డ్యామేజ్ చేయడం జరిగింది.
సాధారణంగా, ఎవరైనా శబ్ద కాలుష్యాన్ని కలిగించే సైలెన్సర్ వాడితే, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, వాహన యజమానులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.