నడిరోడ్డుపై మూడు పాముల ప్రేమ యుద్ధం వైరల్

A rare love triangle among three snakes on a road in Pune has gone viral, drawing hilarious and curious reactions from netizens. A rare love triangle among three snakes on a road in Pune has gone viral, drawing hilarious and curious reactions from netizens.

సాధారణంగా పాములు కనిపిస్తే ప్రజలు భయంతో పరుగులు తీయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, తాజాగా నడిరోడ్డుపై చోటుచేసుకున్న అరుదైన ఘటన ఇప్పుడు నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది. పూణే కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్డు మధ్యలో మూడు పాములు కలసి ప్రేమాటలతో మునిగి తేలిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

వీడియోలో ఒక ఆడ పామును రెండు మగ పాములు అనుసరిస్తూ రోడ్డుపైకి రావడం కన్పిస్తుంది. ఆ తర్వాత ఓ మగ పాము ఆ ఆడ పామును పెనవేసుకుని ప్రేమ సయ్యాట ప్రారంభించింది. ఇదంతా చూస్తున్న మిగిలిన మగ పాము కూడా మధ్యలోకి వచ్చి తన ప్రేమను ప్రకటించినట్లు కనిపించింది. ఆ ముగ్గురు పాముల మధ్య ప్రేమ యుద్ధం చూడ్డానికి అసాధారణంగా ఉంది.

ఈ ముగ్గురు పాములు కొంతసేపు పరస్పరం గుదుగుదులాడుకుంటూ రోడ్డుమీద దొర్లుతూ కనిపించాయి. అటువైపు వెళ్తున్న కొందరు వ్యక్తులు ఈ అరుదైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఈ వీడియో కాస్తా తెగ వైరల్ అయ్యింది. ప్రస్తుతం వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

వీడియో చూసిన నెటిజన్లు పాముల ప్రేమ ట్రయాంగిల్‌పై విచిత్రమైన కామెంట్లు పెడుతున్నారు. “స్నేక్ లవ్ ట్రయాంగిల్” అంటూ జోక్స్ వేస్తున్నారు. పాముల ప్రేమకథను జంతు శాస్త్రం కోణంలో కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. పూణేలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అంతర్జాలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *