కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను NDPS యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగిందని డిఎస్పీ శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డిఎస్పీ మాట్లాడుతూ: ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఒక వ్యక్తి ఇంట్లో గంజాయి , ఆల్పోజోలం, ఉన్నట్లు ఎస్ఐ మహేష్ కి వచ్చిన సమాచారం మేరకు తనిఖీ చేయడం జరిగిందని తనిఖీలో భాగంగా 5 గ్రాముల ఆల్పోజోలం దొరికిందని అన్నారు. ఈశ్వర్ గౌడ్ కు ఆల్పోజోలం సప్లయ్ చేసిన నారాగౌడ్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీ ముమ్మరం చేయగా గంజాయి , ఆల్పోజోలం , క్లోరల్ హైడ్రేట్ దొరికాయని అన్నారు. కానీ ఈశ్వర్ గౌడ్ నాకు వీటితో ఎలాంటి సంబంధం లేదని అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి పై అనుమానం వ్యక్తం చేయగా లక్ష్మణ్ ను విచారించడం జరిగిందని ఎల్లారెడ్డి డిఎస్పీ తెలిపారు. పోలీసుల విచారణలో లక్ష్మణ్ నాకు శ్రీనివాస్ గౌడ్ 15 వేల రూపాయలు ఇచ్చి ఈ వస్తువుల సంచిని ఈశ్వర్ గౌడ్ ఇంట్లో పెట్టి పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసులు వచ్చి ఈశ్వర్ గౌడ్ ను అరెస్ట్ చేస్తారని చెప్పడంతో లక్ష్మణ్ ఈ పని చేశానని ఒప్పుకున్నారని తెలిపారు. గంజాయి 55 గ్రాములు, ఆల్పోజోలం 90 గ్రాములు ఒకటి 190 గ్రాముల మరో ప్యాకెట్ తో పాటు క్లోరో హైడ్రేట్ 140 గ్రాములు లభించడంతో వీటిని సీజ్ చేసి ప్రస్తుతం లక్ష్మణ్ నారాగౌడ్ , ఈశ్వర్ గౌడ్ లను అరెస్ట్ చేసామని అన్నారు.తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ పరారీలో ఉన్నాడని నిందితుని పట్టుకోవడం కోసం స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి హైదరాబాద్ పంపినట్లు తెలిపారు. ఈ కేసు ను ఇంత తొందరగా చాకచక్యంగా వ్యవహరించి చేధించిన సిఐ రవీందర్ నాయక్ మరియు ఎస్ఐ మహేష్ లకు జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందిస్తూ పోలీస్ శాఖ తరపున బహుమతి కూడా త్వరలోనే అందించడం జరుగుతుందని డీస్పీ శ్రీనివాసలు తెలిపారు.
తిమ్మాపూర్ లో నిషేధిత మందుల కేసులో ముగ్గురి అరెస్ట్
