బెట్టింగ్‌ యాప్‌ల కారణంగా దొంగతనాలకు పాల్పడిన దొంగ అరెస్టు

A thief, driven by losses from betting apps, was arrested in Warangal for multiple thefts. Police recovered stolen gold, silver, cash, and tools used in the crimes. A thief, driven by losses from betting apps, was arrested in Warangal for multiple thefts. Police recovered stolen gold, silver, cash, and tools used in the crimes.

బెట్టింగ్‌ యాప్‌ల కారణంగా నష్టపోయి చివరికి చోరీలకు పాల్పడతున్న దొంగను సిసిఎస్‌ మరియు కెయూసి పోలీసులు సంయుక్తంగా కలిసి మంగళవారం అరెస్టు చేసారు. అరెస్టు చేసిన నిందితుడి నుండి పోలీసులు సూమారు 28లక్షల50వేల రూపాయల విలువగల 334గ్రాముల బంగారు, ఒక కిలో 640 గ్రాముల వెండి అభరణాలు, 13వేల రూపాయల నగదు, ఒక ద్విచక్రవాహనం,ఒక సెల్‌ఫోన్‌, చోరీలకు ఉపయోగించే సాధనాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా వివరాలను వెల్లడిస్తూ కొండపల్లి ధర్మరాజు, వయస్సు 30, రాయపర్తి, వరంగల్‌ జిల్లా, ప్రస్తుతం హనుమకొండ,సుబేదారి, పోస్టల్‌ కాలనీలో నివాసం వుంటున్నాడు. నిందితుడు ధర్మరాజు డిగ్రీ పూర్తి చేసి కొద్ది కాలం రాయపర్తి మండల కేంద్రంలో బిర్యానీ సెంటర్‌ నిర్వహించి నష్టపోవడంతో హనుమకొండ పోస్టల్‌ కాలనీలో విద్యార్థినంటూ కిరాయి ఇంటిలో మకాం మార్చాడు.

నష్టపోయిన డబ్బును తిరిగి పొందేందుకుగాను నిందితుడు వివిధ మార్గాల్లో వ్యక్తిగత రుణాలు తీసుకొని అన్‌లైన్‌ బెట్టింగ్‌ అడటం ద్వారా నిందితుడు నష్టపోయి, తీసుకున్న రుణాలకు వాయిదాలు చెల్లించలేక పూర్తిగా అప్పులయ్యాడు. దీనితో నిందితుడు తన అప్పులను తీర్చడంతో పాటు సులభం డబ్బు సంపాదించాలనికొని దొంగతనాల మర్గాన్ని ఎంచుకొని దొంగగా మారాడు. ఇందుకోసం నిందితుడు చోరీలు చేసేందుకు సాధనాలను సమకూర్చుకొవడంతో పాటు, తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ పగటి సమయాల్లో తాళం వేసి వున్న ఇండ్లను గుర్తించి రాత్రి సమయాల్లో నిందితుడు తాళం వేసివున్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడేవాడు. ఇదే రీతిలో నిందితుడు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 17 చోరీలకు పాల్పడగా ఇందులో కెయూసి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 8, హనుమకొండ, హసన్‌పర్తి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 2చొప్పున, అలాగే సుబేదారి,సంగెం,ఘన్‌పూర్‌,పాలకుర్తి,దేవరుప్పుల పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున చోరీలకు పాల్పడ్డాడు.
ఈ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు సెంట్రల్‌ జోన్‌ డిసిపి షేక్‌ సలీమా పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు తమ వద్ద వున్న అధునిక టెక్నాలజీని వినియోగించుకోని నిందితుడుని గుర్తించడంతో పాటు అతనిపై నిఘా పెట్టారు. నిందితుడు ఈ రోజు నిందితుడు తాను చోరీ చేసిన చోరీ సోత్తు అమ్మేందుకు వాహనంపై కెయూసి వైపు వస్తునట్లుగా పోలీసులకు పక్కా సమాచారం రావడంతో సిసిఎస్‌, కెయూసి పోలీసులు సంయుక్తంగా కెయూ క్రాస్‌లో వాహన తనీఖీల్లో నిందితుడు పోలీసులు పట్టుపడటంతో పోలీసుల విచారణ నిందితుడు పాల్పడిన నేరాలను అంగీకరించగా, నిందితుడి నుండి పోలీసులు చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకొని దొంగ సొత్తు ను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్‌ జోన్‌ డిసిపి సలీమా, అదనపు డిసిపి రవి, క్రైమ్‌ ఎసిపి భోజ రాజు, హన్మకొండ ఎసిపి దేవేందర్‌ రెడ్డి, సిసిఎస్‌ ఇన్స్‌స్పెక్టర్లు బాలాజీ వరప్రసాద్‌, రఘు,శివకుమార్‌,కేయూసీ ఇన్స్‌స్పెక్టర్‌ రవి కుమార్‌,ఎఎఓ సల్మాన్‌ పాషా, సిసిఎస్‌ఎ.ఎస్‌.ఐ శివకుమార్‌ హెడ్‌కానిస్టేబుళ్లు నజీం ఆహ్మద్‌ జంపయ్య,కానిస్టేబుళ్లు చంద్రశేకర్‌,మదూకర్‌,రాములు, వెంకన్న,కెయూసి,క్రైమ్‌ టీం లను వరంగల్‌ పొలిసు కమీషనర్‌ అభినందిచినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *