అఖండ 2 “తాండవం” సాంగ్ ప్రోమో వచ్చేసింది.నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు థమన్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం”అఖండ”ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు అదే కాంబినేషన్ మరోసారి స్క్రీన్‌పై మెరిపించబోతోంది. ఈ మాసివ్ కాంబో నుంచి రాబోతున్న చిత్రం”అఖండ 2 తాండవం (Akhanda 2 Thaandavam) ఇప్పటికే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌లతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం”డిసెంబర్ 5న” ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ ప్రమోషన్లు వేగంగా ప్రారంభించింది.
ఇందులో భాగంగా తాజాగా విడుదల చేసిన “‘తాండవం’ సాంగ్ ప్రోమో”సోషల్ మీడియాలో సూపర్ హిట్‌గా మారింది. థమన్ ఇచ్చిన పవర్‌ఫుల్ బీజీఎమ్, బాలయ్య ఎలివేషన్ సీన్స్‌తో ఈ పాట ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది.
ALSO READ:IND vs AUS 5వ టీ20: సిరీస్ కైవసం దిశగా భారత్, ఒత్తిడిలో ఆస్ట్రేలియా
బోయపాటి దర్శకత్వం, బాలకృష్ణ శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్, థమన్ మ్యూజిక్ అన్నీ కలిసివచ్చి ఈ సినిమా మళ్లీ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.
అఖండలో కనిపించిన ఆ దేవతా శక్తి, ఆత్మవిశ్వాసం, అద్భుతమైన యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సీక్వెల్‌లో మరింతగా ఉండనున్నాయని సమాచారం.
