రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో మహిళ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆమె త్యాగాలను స్మరించుకున్నారు. తెలుగు పండితుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ, మహిళల చదువుల కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి నిరుపమానమని కొనియాడారు.
ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే ను “చదువుల తల్లి”గా సత్కరించి, విద్యార్థులు వారి సేవలను స్మరించి, తదనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వారి త్యాగాల వల్ల మహిళల విద్యావ్యాప్తి సాధ్యమైందని వివరించారు.
ఈ కార్యక్రమంలో మహిళ ఉపాధ్యాయులు రాధిక, శ్రీమతి రిజ్వాన, నుజత్ సుల్తానా, సాయిరాలను సన్మానించారు. ఉపాధ్యాయుల సేవలకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రధానోపాధ్యాయులు సుజాతుల్ల, ఉపాధ్యాయులు దీకొండ విజయ్ కుమార్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
