‘తండేల్’ ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా.. రేపటికి షిఫ్ట్!

The pre-release event of Naga Chaitanya and Sai Pallavi’s ‘Tandel’ has been postponed. The grand event will now take place tomorrow. The pre-release event of Naga Chaitanya and Sai Pallavi’s ‘Tandel’ has been postponed. The grand event will now take place tomorrow.

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తండేల్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ శనివారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని మేకర్స్ తెలిపారు.

ఈ వేడుకను రేపటికి (ఆదివారం) మార్చినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. “ది ఐకానిక్‌ తండేల్‌ జాతరను రేపటికి వాయిదా వేస్తున్నాం. ఈవెంట్‌ భారీ స్థాయిలో జరుగుతుంది” అంటూ చిత్ర బృందం పోస్ట్ చేసింది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఇప్పటికే ‘తండేల్’ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. విశాఖపట్నంలో తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన టీమ్, ఇటీవల ముంబయిలో హిందీ ట్రైలర్ లాంచ్ వేడుకను గ్రాండ్‌గా జరిపింది. ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ మిస్ట‌ర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

అలాగే చెన్నైలో తమిళ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది. అన్ని భాషల్లో సినిమాకు భారీ స్థాయిలో ప్రచారం కల్పిస్తున్న టీమ్, రేపటి ప్రీరిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *