పాక్ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపేందుకు చైనా సిద్ధం
చైనాకు చెందిన మానవ సహిత అంతరిక్ష కేంద్రం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యోమగాములకు చైనా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. వారిలో ఒకరిని “పెలోడ్ స్పెషలిస్ట్”గా ఎంపిక చేసి, స్వల్పకాలిక అంతరిక్ష ప్రయాణ మిషన్‌లో చైనా వ్యోమగాములతో కలిసి పంపేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మిషన్‌లో పాకిస్థాన్ వ్యోమగామి శాస్త్రీయ ప్రయోగాలు, సాంకేతిక ప్రదర్శనల్లో చైనా వ్యోమగాములకు సహకరించనున్నారు. చైనా మానవ సహిత అంతరిక్ష కేంద్ర ప్రతినిధి జాంగ్ జింగ్బో మాట్లాడుతూ, పాకిస్థాన్…
