రాణి ముఖర్జీ భావోద్వేగాలు: తండ్రి కూడా సమర్ధించలేదు – నటిగా నా ప్రయాణం సులభం కాదు

బాలీవుడ్ సీనియర్ నటి రాణి ముఖర్జీ తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలు, కుటుంబం నుంచి లభించిన మద్దతు, మరియు నటిగా తన దృక్కోణం గురించి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినీ రంగంలోకి అడుగుపెట్టే రోజుల్లోనే తన తండ్రి రామ్ ముఖర్జీ కూడా ఈ నిర్ణయాన్ని సమర్ధించలేదని ఆమె తెలిపారు. “ఆ రోజుల్లో సినిమా కుటుంబాల పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు నటనను వృత్తిగా ఎంచుకోవడం అరుదు. నా తల్లి కూడా ఒక దశలో నిర్మాతను కలిసి నన్ను…

Read More

అత్యంత సంపన్న యువ పారిశ్రామికవేత్తగా రోష్ని నాడార్! ₹2.84 లక్షల కోట్లు ఆస్తి

భారతదేశంలో మహిళా శక్తి ప్రభావం మరింత బలంగా కనిపిస్తోంది. టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా తాజాగా మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె దేశంలో అత్యంత సంపన్న మహిళగా, అలాగే టాప్ 10 కుబేరుల్లో అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. రూ. 2.84 లక్షల కోట్ల ఆస్తి విలువ ప్రఖ్యాత వ్యాపార విశ్లేషణ సంస్థ ఎం3ఎం-హురున్ ఇండియా 2025కి గాను విడుదల చేసిన భారత సంపన్నుల జాబితా…

Read More

‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ అంటూ బతుకమ్మ ఉత్సవాల్లో తెలంగాణ మహిళా మంత్రులు – సచివాలయంలో సందడి, గడ్డం సంతోష్ పాట ఆవిష్కరణ

సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క మహిళా ఉద్యోగులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొనడం విశేషంగా నిలిచింది. “ఒక్కేసి పువ్వేసి చందమామ” అంటూ పాడుకుంటూ, సంప్రదాయ పూలు నింపిన బతుకమ్మలను ఆటపాటలతో కూడిన ఉత్సాహంలో ఆడారు. ఈ సందర్భంగా సచివాలయం ఆవరణ పూలతో కళకళలాడింది. పలువురు మహిళా ఉద్యోగులు తమ ఇళ్ల నుంచి అందంగా పేర్చి తీసుకువచ్చిన బతుకమ్మలను తీసుకువచ్చి, సచివాలయంలో ఉంచి ఉత్సవానికి శోభ జత చేశారు. మహిళా మంత్రులు సురేఖ, సీతక్కలు పక్కపక్కనే నిలబడి…

Read More

దివ్యాంగురాలు సోనియా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న హృదయ విదారక గాథ

హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాలో 37 ఏళ్ల దివ్యాంగురాలు సోనియా తన జీవిత పోరాటంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్నప్పటి నుంచే కాలు సరిగా పనిచేయని ఆమె నిలబడటానికి కూడా ఇబ్బందిపడుతుంటారు. అయినప్పటికీ, తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎలక్ట్రిక్ ఆటో రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సోనియాకు భర్త అనిల్ మాదకద్రవ్యాలకు బానిస కావడంతో కుటుంబం కష్టాల్లో పడింది. ఇల్లు పోషించడమే కాకుండా, 13 ఏళ్ల కుమార్తె చదువు ఖర్చులు కూడా చూసుకోవాల్సి రావడంతో ఆమెకు ఆర్థిక…

Read More