వివాహ వేడుకల్లో దేశభక్తి జల్లు – వందేమాతరతో ప్రారంభమైన పెళ్లి వేడుక
వరంగల్: జీవితంలో ఒక్కసారి జరిగే వివాహ వేడుకలోనూ దేశభక్తి ప్రతిధ్వనించింది. వరంగల్ నగరంలోని రంగశాయి పేటకు చెందిన కానిస్టేబుల్ గోగికార్ శ్రీకాంత్, లక్ష్మిసాయి ల వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. అయితే ఈ పెళ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివాహ వేడుకలో భాగంగా ‘వందేమాతరం’ గీతం రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పెళ్లి మండపంలోనే సామూహిక వందేమాతర గీతాలాపన నిర్వహించారు. వధూవరులు, బంధుమిత్రులు, అతిథులు అందరూ కలసి దేశభక్తితో గళం…
