ఉక్రెయిన్ వివాదంపై అమెరికా స్పందన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన విడుదల చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య వివాదానికి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్న ఏ దేశానికైనా స్వాగతం పలుకుతామని పేర్కొంది. ఉక్రెయిన్ ప్రజల ప్రత్యేక హక్కులు, శాంతిని కోరుకుంటున్న అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అనుగుణంగా కృషి చేయాలని, అలాంటి పాత్ర పోషించే దేశాన్ని తాము కచ్చితంగా స్వాగతిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు వైట్‌హౌస్ జాతీయ భద్రతా సమాచార…
