ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సత్యప్రభ
ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పర్యటించారు. యర్రవరంలోని పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఆమె, ఏలేశ్వరం వద్ద కృంగిన అప్పల పాలెం వంతెనను పరిశీలించారు. తదనంతరం తిమ్మరాజు చెరువును కూడా తనిఖీ చేశారు. ఏలేరు జలాశయాన్ని సందర్శించి, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలను అధికారులతో చర్చించారు. జలాశయం నీటిమట్టం గరిష్ట సాయికి చేరిందని తెలిపారు. సుమారు 27 వేల క్యూసెక్కుల నీటిని కాలువ ద్వారా విడుదల చేశారని చెప్పారు. ఈ కారణంగా పలు గ్రామాల్లో వరద…
