 
        
            కవిత కీలక నిర్ణయం – జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లకావత్ రూప్ సింగ్
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ కార్యకలాపాలను మళ్లీ వేగవంతం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను పునరుత్తేజం చేయడానికి ఆమె పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని జాగృతి రాష్ట్ర కమిటీకి కొత్త సభ్యులను నియమించినట్లు కవిత ప్రకటించారు. ఈ నియామకాల్లో సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు. కొత్త కార్యవర్గంలోని 80 శాతం…

 
         
         
         
         
        