ప్రజల నమ్మకంతో ఎన్డీఏ కూటమి 100 రోజుల సఫలత
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు 100 రోజులు పూర్తైన సందర్భంగా మడుతూరు గ్రామంలో గోడపత్రిక ఆవిష్కరణ జనసేన నేత మోటూరు శ్రీ వేణి ఆధ్వర్యంలో జరిగింది. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం సామాజిక పెన్షన్ల పెంపు, నిరుద్యోగుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్, పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల ఏర్పాటు వంటి పథకాలు ప్రారంభించిందని ఆమె అన్నారు. గ్రామ స్వరాజ్యం దిశగా పంచాయతీల బలోపేతం కోసం 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించడమే కాకుండా, ఇతర సామాజిక…
