ముంబైలో యువకుడు ట్రాఫిక్ పోలీసులను వెంటాడి పట్టుకున్న వీడియో వైరల్ – నెంబర్ ప్లేట్ తప్పు, రూ.2 వేల ఫైన్
మహారాష్ట్రలో ఒక యువకుడు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెల్మెట్ లేకుండా బైక్పై ప్రయాణించినందుకు తనపై రూ.1,000 జరిమానా విధించారనే కోపంతో, ఆ యువకుడు ప్రతీకారం తీర్చుకునే విధంగా నెంబర్ ప్లేట్ సరిగా లేని స్కూటర్పై ప్రయాణిస్తున్న ట్రాఫిక్ పోలీసులను వెంబడించి పట్టుకున్నాడు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే — ముంబైలోని ఒక రద్దీ రహదారిపై ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు…
