పాలేరు రిజర్వాయర్ వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పరిశీలన
కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ పరివాహక ప్రాంతాల్లో వరద ముంపు గురైన పంట పొలాలను, రహదారులను కేంద్ర బృందం పరిశీలించింది. రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై ఈ కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సలహాదారు కల్నల్ కీర్తిప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఆరా తీసింది. కలెక్టర్ తో కలిసి పంటలు, రహదారులు, కాలువ కట్టలు వంటి ప్రాంతాలను బృందం సమగ్రంగా పరిశీలించింది….
