జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు సుమన్ మద్దతు — సోనియా, రాహుల్, రేవంత్‌లకు ధన్యవాదాలు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు వేడెక్కుతున్న వేళ, ప్రముఖ తెలుగు సినీ నటుడు సుమన్ తన రాజకీయ మద్దతును స్పష్టంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ మేరకు సుమన్ ఓ వీడియో సందేశం విడుదల చేస్తూ, నవీన్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సుమన్ మాట్లాడుతూ, “నవీన్ యాదవ్ ఒక యువకుడు,…
