జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై మంత్రులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌ దిశానిర్దేశం 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌ దిశానిర్దేశం చేసారు.ప్రచారం ముగియకముందే ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలవాలని, ఈ మూడు రోజులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులకు సూచించారు. ప్రచారం 9న ముగియనుండటంతో ఒక్క రోజును కూడా వృథా చేయకూడదని స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన సమీక్షలో కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు….

Read More

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌పై కేటీఆర్ దాడి – ప్రజలకు పిలుపు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో వరుస ట్వీట్లు చేస్తూ, ప్రజలకు కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా చిత్తుగా ఓడిస్తేనే 2023 ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాల్సిన భయం అధికారానికి వస్తుందని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు….

Read More

‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ అంటూ బతుకమ్మ ఉత్సవాల్లో తెలంగాణ మహిళా మంత్రులు – సచివాలయంలో సందడి, గడ్డం సంతోష్ పాట ఆవిష్కరణ

సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క మహిళా ఉద్యోగులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొనడం విశేషంగా నిలిచింది. “ఒక్కేసి పువ్వేసి చందమామ” అంటూ పాడుకుంటూ, సంప్రదాయ పూలు నింపిన బతుకమ్మలను ఆటపాటలతో కూడిన ఉత్సాహంలో ఆడారు. ఈ సందర్భంగా సచివాలయం ఆవరణ పూలతో కళకళలాడింది. పలువురు మహిళా ఉద్యోగులు తమ ఇళ్ల నుంచి అందంగా పేర్చి తీసుకువచ్చిన బతుకమ్మలను తీసుకువచ్చి, సచివాలయంలో ఉంచి ఉత్సవానికి శోభ జత చేశారు. మహిళా మంత్రులు సురేఖ, సీతక్కలు పక్కపక్కనే నిలబడి…

Read More