శివానీ ఆత్మహత్య లేఖ.. విద్యార్థుల బాధలకు అద్దం
హనుమకొండ జిల్లా నయీంనగర్‌లోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మిట్టపల్లి శివాని అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన అందరినీ కలిచివేసింది. చదువు ఒత్తిడిని తట్టుకోలేక, తల్లిదండ్రుల అభిప్రాయాలను చెప్పలేక నలిగిపోయిన శివాని, చివరికి చావే దిక్కుగా భావించి ప్రాణాలు వదిలింది. ఆమె మరణానికి ముందు రాసిన లేఖ… ప్రతీ అక్షరం మానసికంగా కుంగిపోయిన పిల్లల మనస్థితిని అద్దం పడుతోంది. “మమ్మీ! ఆ చదువు నాకు అర్థం కావడం లేదు…..
