
రాజాసింగ్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు: జూబ్లీహిల్స్ ఓటమి పై ప్రశ్నలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఎంత ఓట్ల తేడాతో ఓడిపోతారో, ఓటమి తరువాత కేంద్ర పెద్దలకు తన ముఖం ఎలా చూపిస్తారో అని రాజాసింగ్ ప్రశ్నించారు. రాజాసింగ్ వ్యాఖ్యల ప్రకారం, కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. “కిషన్ రెడ్డి గారు, జూబ్లీహిల్స్లో మీరు బీఆర్ఎస్ను గెలిపిస్తారా లేక కాంగ్రెస్ను గెలిపిస్తారా?…