
Anxiety తగ్గించే ఆహారాలు – మానసిక ఆరోగ్యానికి తోడ్పడే డైట్
ఇప్పటి జీవనశైలి, ఉద్యోగ ఒత్తిళ్ల కారణంగా యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మహిళల్లో ఇవి అధికంగా కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సమయానికి వీటిని పట్టించుకోకపోతే రక్తపోటు, డయాబెటిస్, ఒబెసిటీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ప్రతిరోజు ఆహారంలో చిన్న మార్పులు చేస్తే యాంగ్జైటీ సమస్యను తగ్గించుకోవచ్చని వారు సూచిస్తున్నారు. విటమిన్ Dఈ విటమిన్ లోపం డిప్రెషన్, యాంగ్జైటీని పెంచుతుంది. పాలు, పెరుగు, పుట్టగొడుగులు, గుడ్డులో పచ్చసొన,…