
ముంబై–న్యూయార్క్ ఎయిరిండియా విమానం సాంకేతిక లోపంతో వెనక్కి మళ్లింపు
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాను సాంకేతిక లోపాలు వదలడం లేదు. తాజాగా ముంబై నుంచి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లాల్సిన ఏఐ191 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబైకి తిరిగి చేరుకుంది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, ఎయిరిండియా ఏఐ191 విమానం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్ది సేపటికే సిబ్బంది సాంకేతిక లోపాన్ని గుర్తించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించాలని…