
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఘనోత్సవం
విజయవాడ ఇంద్రకీలాద్రి జగన్మాత నామంతో మార్మోగుతోంది. “జయదుర్గా జైజైదుర్గా” అంటూ భక్తులు ఆర్తితో అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. “అరుణకిరణజాలై రంచితాశావకాశా” అంటూ బాలా త్రిపుర సుందరీ దేవిని భక్తులు భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. మొత్తం 11 రోజులపాటు జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం రద్దీగా మారింది. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రోజుకొకటి చొప్పున పదకొండు రోజులు ప్రత్యేక అలంకరణలతో…