
హబ్సిగూడలో మద్యం లోడుతో వాహనానికి మంటలు – సీసాల కోసం ఎగబడిన స్థానికులు!
హైదరాబాద్లోని హబ్సిగూడ ప్రాంతం మంగళవారం ఉదయం ఓ విలక్షణ సంఘటనకు వేదికైంది. మద్యం లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పినప్పటికీ, ఈ ఘటన చుట్టూ చోటుచేసుకున్న పరిణామాలు స్థానికులను ఆశ్చర్యంలో ముంచేశాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది వాహనంలో మంటలు కనిపించగానే డ్రైవర్ తక్షణమే వాహనాన్ని రోడ్డుకెరుపున నిలిపాడు. వెంటనే స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఫైరింజన్ రావడానికి ముందే…