కర్నూలు బస్సు అగ్నిప్రమాదంపై రష్మిక మందన్న ఆవేదన – “ఊహించడానికే భయంగా ఉంది”
కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర బస్సు అగ్నిప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై సినీ తారలు, రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ప్రముఖ నటి రష్మిక మందన్న కూడా ఈ విషాదంపై తన తీవ్ర ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రష్మిక తన పోస్ట్‌లో పేర్కొంటూ, “కర్నూలు బస్సు ప్రమాదం వార్త నా హృదయాన్ని కలచివేసింది. కాలిపోయే ముందు ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు ఎదుర్కొన్న బాధను ఊహించడానికే…
