
ఇన్ఫోసిస్ మధ్యంతర డివిడెండ్ బంపర్ – నారాయణ మూర్తి కుటుంబానికి రూ. 347 కోట్లు!
దేశీయ ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా ప్రకటించిన మధ్యంతర డివిడెండ్‌తో సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుటుంబానికి భారీ లాభం దక్కనుంది. కంపెనీ ఒక్కో షేరుకు రూ. 23 చొప్పున డివిడెండ్ ప్రకటించగా, కేవలం మూర్తి కుటుంబానికే సుమారు రూ. 347.20 కోట్లు అందనున్నట్లు అంచనా. ఇన్ఫోసిస్ ఇటీవల ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల అనంతరం ఈ డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్ పొందడానికి అక్టోబర్ 27ని రికార్డ్ డేట్‌గా నిర్ణయించగా, నవంబర్ 7న…