
ఐటీ షేర్ల దన్నుతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు
ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ప్రారంభించాయి. ముఖ్యంగా ఐటీ రంగం షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరవచ్చన్న సానుకూల అంచనాలు మదుపరుల విశ్వాసాన్ని మరింత పెంచాయి. ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 727.81 పాయింట్లు పెరిగి 85,154.15 వద్దకు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 188.6 పాయింట్లు లాభపడి కీలకమైన 26,000 మార్కును అధిగమించి 26,057.20…