ఎల్కతుర్తి రోడ్డుపై వదిలిన నాటు కోళ్లు – ప్రజలు పట్టుకుంటున్న దృశ్యం

ఎల్కతుర్తిలో వింత ఘటన.. రెండు వేల నాటు కోళ్లు రోడ్డుపక్కన వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఎల్కతుర్తి, హనుమకొండ జిల్లా: స్థానికంగా వింత ఘటన చోటుచేసుకుంది. ఎల్కతుర్తి సమీపంలోని సిద్దిపేట–ఎల్కతుర్తి ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తులు భారీ ఎత్తున నాటు కోళ్లను వదిలి వెళ్లారు. అంచనా ప్రకారం సుమారు రెండు వేల (2000) నాటు కోళ్లు రహదారి పక్కన, పొలాల్లో కనిపించాయి. ఉదయం రైతులు, ప్రయాణికులు వాటిని గమనించగా, ఈ విషయం గ్రామమంతా తెలిసిపోయింది. కొద్ది సేపటికే నాటు కోళ్లను పట్టుకోవడానికి స్థానికులు పరుగులు తీశారు. పెద్దలు, పిల్లలు, మహిళలు అందరూ…

Read More