కర్ణాటకలో కారు,వ్యాను ఢీకొని తెలంగాణ వాసులు మృతి

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం – నలుగురు తెలంగాణ వాసుల మృతి

కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్‌ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను, కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు అక్కడికక్కడే మృతి చెందగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన నవీన్‌ (40), రాచప్ప‌ (45), కాశీనాథ్‌ (60), నాగరాజు‌ (40)గా పోలీసులు గుర్తించారు.సమాచారం ప్రకారం, వీరంతా గణగాపూర్‌ దత్తాత్రేయ ఆలయ దర్శనం ముగించుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఈ క్రమంలో…

Read More