పల్నాడు అడవిలో 30 గంటలుగా తప్పిపోయిన వృద్ధురాలు, డ్రోన్ సాయంతో రక్షణ
పల్నాడు జిల్లాలో బంధువుల ఇంటికి వెళుతూ దారి తప్పి అడవిలో చిక్కుకుపోయిన 60 ఏళ్ల బనావత్ బోడిబాయి సుమారు 30 గంటల పాటు భయానక పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంలో రాత్రంతా కొండపై జాగారం చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనపై బండ్లమోటు పోలీసులు రంగంలోకి దిగి గాలింపు, రేస్క్యూ చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమెరా సాయంతో ఆమెను గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే, బోడిబాయి బొల్లాపల్లి మండలంలోని మేకలదిన్నె…
