పాత రాయల్ చెరువుకు గండి – గ్రామాల్లో నీటి ప్రవాహం, రైతుల్లో ఆందోళన
సత్యవేడు నియోజకవర్గంలోని కె.వి.బి.పురం మండలంలో ఉన్న పాత రాయల్ చెరువుకు భారీగా గండి పడింది. చెరువు గట్టు తెగిపోవడంతో గ్రామాల మధ్యలో నీరు ప్రవహిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చెరువు నిండిపోవడంతో ఒత్తిడి పెరగడం, దానివల్ల గండి ఏర్పడిందని గ్రామస్థులు తెలిపారు.చెరువు నీరు పాతపాలెం, కలెత్తూరు, అరుంధతి వాడ గ్రామాల్లోకి చేరడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నీటిమునిగిన పొలాలు, ఇళ్ల వద్ద వరద ముప్పు కారణంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవాహ ఉద్ధృతి కాలంగి…
