
ఢిల్లీ-దిమాపూర్ ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్ మంటలు: ప్రయాణికులు సురక్షితులు
ఆదివారం ఉదయం, ఢిల్లీ నుంచి నాగాలాండ్‌లోని దిమాపూర్‌కు బయల్దేరిన ఇండిగో విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ కోసం రన్‌వేపైకి వెళ్తుండగా (ట్యాక్సీయింగ్), ఒక ప్రయాణికుడి పవర్ బ్యాంక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీని కారణంగా కొంతసేపు ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు, కానీ విమాన సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు, పెద్ద ప్రమాదాన్ని నివారించారు. ఇండిగో 6E 2107 విమానం ఈ ఘటనలో చేరింది. ఈ సమయంలో ఓ ప్రయాణికుడు తన పవర్ బ్యాంక్‌ను…