
రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్ – రూ.3,000కే ఏడాది ప్రయాణం!
పండుగ సీజన్లో తరచుగా ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో వినూత్న ఆఫర్ ప్రకటించింది. ఇకపై మీరు మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు! ఈ ప్రత్యేక సౌకర్యాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తమ అధికారిక ‘రాజ్‌మార్గ్‌యాత్ర’ యాప్‌లో ప్రవేశపెట్టింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రహదారుల ప్రయాణం మరింత సులభం, చౌకగా మారనుంది. ఈ పాస్‌తో వాహనదారులు ఏటా రూ.3,000 చెల్లించి ఒక…