
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఆగ్రహం – నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్!
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వివాదం మళ్లీ చెలరేగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదంటూ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ వంటి ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫాతీ) నవంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్కు పిలుపునిచ్చింది. గతంలో బకాయిలు చెల్లించకపోవడంతోనే అక్టోబర్ 13 నుంచే బంద్ చేపట్టాలని యాజమాన్యాలు…