శ్రీకాకుళంలో పంటనష్టం నమోదుకు గడువు పొడిగింపు – అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం
శ్రీకాకుళం జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో రైతులు ఎదుర్కొన్న పంటనష్టంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంటనష్టం నమోదుకు గడువు మరో రెండు రోజులు పొడిగించినట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ-క్రాప్ నమోదు వందశాతం పూర్తయిందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే మాజీ ముఖ్యమంత్రి…
