
తిరుమల బ్రహ్మోత్సవాలు……………………….
తిరువీధులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్న వేళ.. అశేష జనవాహిని మధ్య శ్రీనివాసుడు ఊరేగుతూ కనువిందు చేస్తున్న వేళ.. దేవతలే వాహనాలుగా మారి వైకుంఠనాథుడికి బ్రహ్మరథం పడుతున్న వేళ.. భూలోకమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకున్న వేళ.. జరిగే బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల్లో ప్రతి అడుగూ ప్రత్యేకమే. ప్రతిసేవా వైభవోపేతమే. బ్రహ్మోత్సం బ్రహ్మదేవుడే భక్తుడిగా మారి.. శ్రీనివాసుడికి మొదటిసారిగా బ్రహ్మోత్సవాలను నిర్వహించాడని భవిష్యోత్తర పురాణంచెబుతోంది. సృష్టికారకుడైన బ్రహ్మ.. ఈ ఉత్సవాలను ప్రారంభించిన కారణంగా వీటిని బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. మరో కథనం…