బొత్స సత్యనారాయణ ఫైర్: పంట నష్టాలపై ప్రభుత్వం లెక్కలు చెప్పాలి
మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు భారీ నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటికీ పంట నష్టాలపై సమగ్రమైన లెక్కలను విడుదల చేయలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. 24 జిల్లాల్లో రైతులు నష్టపోయినా, ముఖ్యమంత్రి, మంత్రులు మాటలకే పరిమితం అయ్యారని ఆయన విమర్శించారు. గత 18 నెలల్లో వర్షాలు, కరువు కారణంగా నష్టపోయిన మండలాల వారీగా పరిహారం వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని బొత్స డిమాండ్ చేశారు. “పంట నష్టంపై ప్రభుత్వం పూర్తి…
