ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో పెను ప్రమాదం తప్పింది – ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ రైల్వే డివిజన్‌లో గురువారం మరోసారి రైల్వే భద్రతపై ప్రశ్నలు తలెత్తే సంఘటన చోటుచేసుకుంది. ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు ఒకదానికొకటి ఎదురెదురుగా రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే లోకోపైలట్‌లు అప్రమత్తంగా వ్యవహరించి రైళ్లను సమయానికి నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సిగ్నల్‌లో తలెత్తిన సాంకేతిక లోపమే కారణమై ఉండొచ్చని ప్రాథమిక సమాచారం తెలుస్తోంది. ఇదే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కొన్ని రోజుల…
