ఏపీలో రైతు భూమి కుంగిపోవడం… మిస్టరీగా మారిన ఘటన…
ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నట్టుండి భూమి కుంగిపోవడం మిస్టరీగా మారింది. జిల్లా పరిధిలోని దువ్వూరు మండలం చింతకుంట గ్రామంలో రైతు మానుకొండు శివకి చెందిన వ్యవసాయ భూమిలో బుధవారం నాడు సుమారు 6 అడుగుల లోతు కుంగిపోయింది. పైనుంచి చూస్తుంటే అచ్చం పెద్ద బావిలా కనిపిస్తోందని రైతు వాపోతున్నారు. అసలేమైందో కూడా తెలియడం లేదని, ఉన్నట్టుండి వ్యవసాయ భూమి ఇలా భారీ గుంతలుగా మారడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. 2019లోనూ ఇలాగే జరిగిందని శివ చెప్పారు….
